వామ్మో.. ఇలా కూడా కరోనా వస్తుందా..?

praveen
ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఈ మహమ్మారి వైరస్  మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఓవైపు ఈ మహమ్మారి వైరస్ కు మెరుగైన వ్యాక్సిన్ కనుగొనేందుకు శరవేగంగా ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పలు ఔషధ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాఖ్యలు క్లినికల్ ట్రయల్స్ దశలో కూడా ఉన్నాయి. అదే సమయం లో కరోనా  వైరస్ వ్యాప్తి కి సంబంధించి కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అధ్యయనంలో సరి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.



 పాడటం అరవటం ద్వారా కూడా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా  వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు తుమ్ము, ముక్కు చీదడం. పాటలు పాడటం. అరవడం మాట్లాడటం గాలి పీల్చుకోవడం లాంటివి చేయడం ద్వారా కూడా.. వివిధ సైజులలో తుంపర్లు బయటకు వస్తాయని... అవి  ఇతరులపై ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే చిన్న సైజు తుంపర్లు... సిగరెట్ పొగ మాదిరిగా వ్యాపించే తుంపర్లు కొన్ని గంటల వరకు గాలిలో ఉండే ప్రమాదం ఉంది అంటూ చెబుతున్నారు పరిశోధకులు.




 పెద్ద తుంపర్ల కంటే ఈ చిన్న సైజు తుంపర్లు చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు. పెద్ద తుంపర్లు వెంటనే కింద  పడిపోతాయని... చిన్న సైజు తుంపర్లు  మాత్రం గంటల తరబడి గాలిలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు  ఆరు అడుగుల దూరం  వరకు వ్యాపించే  అవకాశాలు కూడా ఉన్నాయట. ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల కంటే ఎక్కువగా భౌతిక దూరం పాటించాలి సూచిస్తున్నారు. ఇలా పాడటం అరవడం ద్వారా కూడా కరోనా  వైరస్ సోకుతుంది అని ఆసక్తికర విషయాలు చెప్పి ప్రజలను అప్రమత్తం చేశారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: