గంటా వస్తారు సరే..! మిగతా వారి పరిస్థితేంటి ?

రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగిలేలా కనిపిస్తున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులంతా వైసీపీ బాట  పట్టారు. ఇక ఎమ్మెల్యే లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ , మద్దాల గిరి, కరణం బలరాం వంటివారు జగన్ కు జై కొట్టారు. రేపు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ కి జై కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఆయన వైసీపీ నాయకులతో చర్చలు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు చాలాకాలం నుంచి వైసీపీలో చేరబోతున్నారనే పెద్దఎత్తున ప్రచారం నడిచినా, అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చేది. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తదితరులు ఆయనకు అడ్డుగా ఉండడంతో జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీకి పోగొట్టాలి అనే ఉద్దేశంతో ఉన్న జగన్ వైసీపీ లోకి గంటాను ఆహ్వానిస్తే, ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతుంది అని, గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో వైసీపీకి తిరుగు ఉండదు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు.


గంటా కూడా ఇప్పుడు జగన్ కు జై కొడితే, ఇంకా వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణబాబు మాత్రమే విశాఖ టిడిపిలో ఉంటారు. గణబాబు సైతం ఇప్పటికే వైసిపి బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ అధిష్టానానికి సంకేతాలు కూడా పంపించారు. అయితే వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రం టిడిపి వీడే అవకాశం కనిపించడం లేదు. కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణ బాబు మొదటి నుంచి టిడిపిని అంటిపెట్టుకుని ఉంటున్నారు. అదీ కాకుండా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా నమ్మకస్తుడిగా ముద్ర వేయించుకోవడంతో ఆయన వైసీపీ లోకి వచ్చి చేరే అవకాశం కనిపించడం లేదు.


 కానీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణ బాబు మాత్రం మరి కొద్ది రోజుల్లోనే వైసీపీకి జై కొట్టబోతున్నట్టు  తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాలు టిడిపిలో మరింత ఆందోళన పెంచుతున్నాయి. పార్టీ నేతల్లో భరోసా కల్పించే విధంగా పార్లమెంటరీ ఇంచార్జీలను నియమిస్తూ, రాష్ట్ర కార్యవర్గంలో కూడా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఇప్పుడు వలసలు పెరిగిపోవడం టిడిపికి మింగుడు పడడం లేదు. వీరే కాకుండా మిగతా జిల్లాల నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ బాట పట్టే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ వ్యవహారాలన్నీ బాబు కి  మరింత అసహనాన్ని కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: