భారత్ లో ప్రతి 16 నిమిషాలకు ఒక రేప్.. ప్రతి గంటకు ఓ వరకట్న వేధింపుల హత్య..!

Suma Kallamadi
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి విధితమే. నలుగురి కర్కశ వేటలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచింది. ఆ ఘటన మరవకముందే ఎన్నో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా జరిగి అందర్నీ విస్తుపోయేలా చేస్తాయి. అయితే భారతదేశంలో ఆడవారి పై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో అంచనా వేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సేకరించిన 2019వ "క్రైమ్ ఇన్ ఇండియా" రికార్డు డేటా విడుదల చేశాయి. అనగా 2019వ సంవత్సరం లో ఆడవారి పై జరిగిన నేరాలు ఎన్నో సవివరంగా తెలియజేయడం అన్నమాట.


ఈ క్రైమ్ ఇన్ ఇండియా డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది. ప్రతి రెండు రోజుల్లో ఒక మహిళ యాసిడ్ దాడికి గురవుతుంది. ప్రతి 30 గంటల వ్యవధిలో ఒక మహిళ సామూహిక అత్యాచారానికి లేదా హత్యకు గురవుతుంది. ఆడవారి మనోభావాలను దెబ్బతీసే దుర్ఘటనలు ప్రతి ఆరు నిమిషాలకి ఒకటి జరుగుతుంది. ప్రతి గంటకి ఆడవారిని అక్రమ రవాణా వేలల్లో జరుగుతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అత్త వారి కారణంగా లేదా భర్త కారణంగా గృహహింసకు పాల్పడే మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నారని.. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ అత్తవారింటి వేధింపులకు నరకయాతన అనుభవిస్తున్నదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.


వరకట్న వేధింపుల కారణంగా ప్రతి 60 నిమిషాల్లో ఆడవారు మృతి చెందుతున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఆడవారిపై ఎన్నో అకృత్యాలు అఘాయిత్యాలు దారుణాలు ప్రతి నిమిషము జరుగుతూనే ఉన్నాయి. ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాల తో మహిళలకు భద్రత ఉందా అన్న భయం సర్వత్రా నెలకొంది. ముఖ్యమంత్రులు, అధికారులు,  పోలీసులు ఆడవారి సంరక్షణ కొరకు కఠిన చర్యలను తీసుకోవాలని ఆడవారిపై జరుగుతున్న దుర్ఘటనలను నిలిపేందుకు ఏదో ఒక ఆలోచన చేయాలని అందరూ గలమెత్తి తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: