ఏపి లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ చర్యలను తీసుకుంటుంది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొనసాగిస్తోంది. రోజుకు కొన్ని వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అధికారులు షాక్ అయ్యేలా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపోతే కేసులు నమోదు అవుతున్న కొద్ది కరోనా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా భారీ గానే పెరుగుతుంది. ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తుండగా, ఆ జిల్లాల్లో కూడా స్వల్పంగా తగ్గిపోయాయి. ఈరోజు 73 వేల మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 6, 224 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇప్పటివరకూ 7,13,014 కేసులు నమోదు కాగా, ఈరోజు 41 మంది కరోనా వల్ల మరణించారు. మొత్తం 5 941 మంది మరణించారు.
కరోనా కేసుల ప్రభావం తగ్గినా కూడా కరోనా మరణాల రేటు ఆందోళనకరంగా మారింది. 7,798 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 55,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాbల వారీగా కరోనా తో చనిపోయిన వారి విషయానికొస్తే.. కృష్ణా జిల్లా లో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు , నెల్లూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, అలాగే శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరం లో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు..