గన్నవరంలో వంశీకి కష్టకాలమే ? ఎడాపెడా ఇబ్బందులే ?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ, గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండటం, నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు కొంతకాలంగా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. అధికార పార్టీగా వైసీపీ అన్ని విషయాల్లోనూ దూసుకుపోతోంది. జగన్ క్షణం తీరిక లేకుండా, ప్రజా సంక్షేమ పథకాల విషయంపైనే దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో నిరంతరం తన శక్తికి మించి కష్టపడుతున్నారు. కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్నారు. ఈ రకంగా జగన్ సక్సెస్ అవుతూ వస్తున్నా, పార్టీ విషయానికి వచ్చేసరికి మొత్తం ఈ వ్యవహారం అంతా బెడిసి కొట్టినట్లుగా తయారవుతోంది.

ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, పరిస్థితిలో మార్పు రాకపోవడం, ఎవరికివారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభాసుపాలవుతూ వస్తోంది. ఇదిలా ఉంటేే ఇప్పుడు కొత్తగా గన్నవరం తలపోటు వివాదాస్పదమవుతోంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ వైసీపీ కి జై కొట్టిన దగ్గర నుంచి గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రావు వర్గాలు వంశీ విషయంలో ఆగ్రహంగా ఉండడం, వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వైసిపి కార్యకర్తలను వేధించడం, ఇలా అన్ని పరిణామాలను గుర్తుచేసుకుంటూ, వంశీ కి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

 పదేళ్లుగా టీడీపీలో ఉన్న వంశీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విజయవాడ పార్లమెంట్ నుంచి ఎంపీగాా పోటీ చేసి ఓటమి  చెందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరినా, ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ముందు ముందు యార్లగడ్డ, దుట్టా వర్గాలతో వంశీ తలపడే అవకాశం ఉండడంతో గన్నవరంలో వివాదాలు మరింత ముదిరేలా కనిపిస్తుండటం వంటివి రాజకీయంగాను, మానసికంగానూ వంశీకి తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: