అన్నాడీఎంకే మంత్రుల ప్రకటన: కాబోయే సీఎం పళని స్వామి...

VAMSI
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో గందరగోళం ఏర్పడేలా ఉంది. ఇప్పుడు ఆ పార్టీ పుట్టడం అసలుకే ముప్పే వచ్చేలా కనిపిస్తోంది. సరికొత్తగా ప్రస్తుత తమిళనాడు సీఎం పదవి కోసం పళనిస్వామి మరియు సొంత పార్టీ నాయకుడు పన్నీర్‌ సెల్వం మధ్య తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి ఉంది.. అయితే వీరో మధ్య విభేదాలు మరియు పదవికోసం ఇద్దరి మధ్య పోటీ ప్రతిపక్ష పార్టీలు పుంజుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లుగా ఉంది.  మరి ఇప్పటికే అన్నాడీఎంకే ప్రకటించిన ప్రకారం రేపు వారి సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనేదానిపై అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.


ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీలోని ఇద్దరు మంత్రులు కాబోయే సీఎం పళని స్వామి అని ఓ సమావేశంలో చెప్పడం మరిన్ని వివాదాలకు దారితీసేలా ఉంది. దీంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన ఎక్కువైంది. ఇప్పుడు ఒకే పార్టీలో ఈవిధమైన గ్రూపు తగాదాలతో రసా భాసగా జరగడం చూసి ఆ పార్టీలోని అభిమానులు మరియు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పన్నీర్‌ సెల్వం విడిగా మీటింగ్‌ పెట్టడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. మరో వైపు సీఎం అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్న సీఎం పళనిస్వామికి కొంగుమండలం ప్రాంతంలో బాగా పట్టుందని కొందరు నేతలు చెబుతున్నారు.



దీంతో ఉపముఖ్యమంత్రి సొంత జిల్లాల్లో అన్నాడీఎంకేకు ఎదురుగాలే వీస్తోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు రోజురోజుకూ ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. స్టాలిన్‌ దూకుడుకు అన్నాడీఎంకే పాలకులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా అజ్ఞాతంలో గడిపిన టీటీవీ దినకరన్‌ ఉన్నట్టుండి తెరమీదికి రావడం.. ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీనడ్డాతో ఫోన్‌లో చర్చలు జరుపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదంతా.. ఇంతకుముందులాగా శశికళ అన్నాడీఎంకేలో పార్టీ వ్యవహారాలను చూసుకునేలాగా మరియు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేలా ప్రణాళికలు రచిస్తున్నారని రాజకీయశ్రేణులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: