రెండోసారి కరోనా పాజిటివ్.. వృద్ధుడు చేసిన పనికి అందరు షాక్..?

praveen
రోజురోజుకీ కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతూ ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేస్తుంది. అంతే కాకుండా ఎంతో మంది ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరిలో తీవ్ర ఆందోళన పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే కొంతమంది కరోనా  వైరస్ సోక  కుండానే అవగాహన లేమితో ఆత్మహత్యలు చేసుకుంటున్న  ఘటనలు కూడా తెరమీదకు వస్తున్నాయి.



 మరికొంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారు అని తెలియగానే మనస్థాపం చెంది చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్న  ఘటనలు  కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా  వైరస్ ఏకంగా ఆ వృద్ధున్ని  మానసికంగా చంపేసింది... దీంతో చివరికి వృద్ధుడు ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జబల్పూర్ నగరానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కి గత నెల 20వ తేదీన కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.



 దీంతో ఆ వృద్ధుడు హోమ్ క్వారంటైన్  లోనే ఉన్నాడు. ఇక 14 రోజుల తర్వాత మరోసారి కరోనా  నిర్ధారణ పరీక్షలు చేయగా మరో సారి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆవేదన చెందిన వృద్ధుడు  చివరికి ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జూస్ ఇచ్చేందుకు వచ్చిన మనవడు అది చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. దీంతో బంధువులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్నారు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  ప్రారంభించారు. కరోనా  నిబంధనల ప్రకారమే ఆత్మహత్య చేసుకున్న సదరు వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: