అరుణాచల్ లో 4 చోట్ల హై అలర్ట్.. భారీ మోహరింపులు..?

praveen
పక్కలో బల్లెం లాగా  ఎప్పుడూ భారత్కు ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది చైనా. నిషేధిత ప్రాంతం లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుని సరికొత్త వివాదానికి తెరలేపి ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తేలా చేసింది చైనా. ఈ క్రమంలోనే భారత భూభాగాన్ని ఆక్రమించుకుని భారత్ పై ఆధిపత్యం సంపాదించాలని అనుకుంది. చైనా ఊహించని  విధంగా భారత్ ధీటు గా నిలబడడమే కాదు... ఏకంగా ఎంతో వ్యూహాత్మకంగా చైనా ఆధీనంలోని  పర్వతాలను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. లడక్ ప్రాంతంలో భారత భూభాగాన్ని ఆక్రమించి కోవాలి అనుకున్న చైనా ఆటలు సాగలేదు.




 అదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి అరుణాచల్ ప్రదేశ్ చైనాలోని  భూభాగమని.. భారత్ అక్రమంగా ఆక్రమించుకుంది  అంటూ ఆరోపణలు చేస్తూనే ఉంది చైనా.  పలుమార్లు చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న  భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కవ్వింపులకు  దిగుతూనే ఉన్నారు. అయితే ఇటీవల అమెరికా ఈ విషయంపై స్పందిస్తూ లడక్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు  భారత్కు చెందిన భూభాగాలు అన్న విషయం ప్రపంచదేశాలు ఎప్పుడో గుర్తించాయని చైనా  ప్రత్యేకంగా గుర్తించాల్సిన  అవసరం లేదు అని వ్యాఖ్యలు చేయడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది.




 ఈ క్రమంలోనే సరిహద్దుల్లో వివిధ ప్రాంతాలలో చొరబడేందుకు చైనా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని నాలుగు ప్రాంతాలలో చైనా సైనికులు చొరబడేందుకు అవకాశం ఉంది అని నిఘా వర్గాల నుంచి భారత సైన్యానికి సమాచారం అందింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన భారత సైన్యం  ఆ నాలుగు ప్రాంతాల్లో  పూర్తిగా సైనికులను మోహరించడం తోపాటు ఆయుధాలను కూడా తరలించింది. చైనా చొరబడేందుకు సిద్ధం అయింది అని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో సైనికులు ఎప్పటికప్పుడు నాలుగు ప్రాంతాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: