కామంతో ఊగిపోయిన యువకులు.. యువతిని కిడ్నాప్ చేసి.. 15 రోజుల తర్వాత..?

praveen
స్వతంత్ర భారతదేశం లో సృష్టికి మూలమైన మహిళలకు అసలు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మానవత్వమున్న మనుషులుగా కరువై కామంతో కళ్లు మూసుకుపోతున్న మనుషులు ఎక్కువవుతున్న తరుణంలో రోజురోజుకు తెర మీదకి వస్తున్న దారుణం ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నపిల్లలు యువతులు ముసలివాళ్ళు అనే తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు మీద పడిపోయి కామ వాంఛలను తీర్చుకుంటున్నారు. సభ్య సమాజంలో బతుకుతుంది మనుషులు కాదు కామంతో కళ్లు మూసుకుపోయిన క్రూర మృగాలు అనే విధంగానే ప్రస్తుతం అందరూ వ్యవహరిస్తున్నారు.


 రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు ఆడపిల్లకు ఎక్కడ రక్షణ లేదు అన్నది అర్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో దేశంలో తరచుగా ఆడపిల్లలపై అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై జరిగిన దారుణ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన యువతి... గత నెల 21వ తేదీన అదృశ్యం అయింది. ఇక ఆ తర్వాత యువతి తల్లిదండ్రులు కంగారు పడిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ తర్వాత దారుణం నిజం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు కు తీసుకెళ్లి యువతిపై దారుణంగా అత్యాచారం చేశారు అని నిజం బయటపడింది. 15రోజుల తర్వాత ఆ యువతి గ్రామానికి చేరుకోవడం తో  పోలీసులు యువతని విచారించారు. తనను కిడ్నప్ చేసి దారుణంగా అత్యాచారం చేశారు అన్న విషయాన్ని పోలీసులకు తెలిపింది యువతి . ఈ ఘటన పై పోక్సో చట్టం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని  దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: