ప్రజలందరికీ షాక్.. ఇక కరోనా టెస్ట్ కి డబ్బు కట్టాల్సిందే..?
ఇన్ని రోజుల వరకు కరోనా టెస్టింగ్ కిట్లపై ఇచ్చిన సబ్సిడీని ఐసీఎంఆర్ ఉపసంహరించుకోవడం కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేఘాలయ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. దీంతో ఇన్ని రోజుల వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పరీక్షలు చేసుకున్న ఎంతో మంది ప్రజలు ఇక నుంచి కరోనా నిర్ధారిత పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్ష కైనా సరే ప్రస్తుతం చార్జీలు వసూలు చేయనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది.
కేవలం కరోనా నిర్ధారిత పరీక్షలు విషయంలోనే కాదు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో కరోనా చికిత్సపొందుతున్న రోగులకు అందించే భోజన సదుపాయం పై కూడా చార్జీలు వసూలు చేయాలా వద్దా అనే దానిపై ప్రస్తుతం చర్చలు జరిపి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది మేఘాలయ ప్రభుత్వం. దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించిన లబ్ధిదారులకు మినహాయింపు ఇచ్చేందుకు కూడా మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కరోనా నిర్ధారిత పరీక్షల కోసం ఐదు వందల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్ టి పి సి ఆర్ పరీక్ష కోసం 3200 రూపాయలు వసూలు చేయనున్నారట.