చైనా పై భారత్ ఢీ-3.. ప్రపంచ దేశాలు ఆశ్చర్యం..?

praveen
భారత్ చైనా సరిహద్దు లో రోజురోజుకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మొన్నటి చర్చల తర్వాత చైనా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించినా  ఏ క్షణంలోనైనా భారతపై  యుద్ధానికి సిద్ధం కావచ్చు అని ప్రస్తుతం భారత రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చైనాకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అన్ని చోట్లా భారత ఆర్మీ ని పటిష్టం చేస్తున్నారు. ఇక  భారత చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ప్రస్తుతం చైనా పై ఏకంగా మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తుంది అని ఇటీవలే జపాన్ రక్షణ రంగ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే భారత్-చైనా పై ఆధిపత్యం సాధించి పైచేయి సాధించగలిగింది అని చెబుతూన్నారు.

 ఇంతకీ ఈ మూడు అంచెల వ్యూహాలు ఏమిటి అంటే... మొదటిది  దౌత్యపరమైన అటువంటి ఎత్తుగడ.   చైనా నిషేధిత ప్రాంతం లోకి వచ్చి చైనా తప్పు చేసింది అనే విషయాన్ని సమర్థవంతంగా ప్రపంచ దేశాలన్నింటి దృష్టికి తీసుకెళ్ళింది భారత్. అంతేకాదు పలు దేశాల మద్దతు కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 1962 ముందు చైనా స్వాధీనం చేసుకున్న భారత భూభాగాలను ఇటీవలే భారత్ స్వాధీనం చేసుకున్నప్పటికీ... అది ఆక్రమణ అని చైనా గొంతు చించుకున్నప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం దాన్ని ఆక్రమణగా చూడలేదు. ఇలా దౌత్య పరంగా భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించింది.

 అంతేకాకుండా భారత్ చైనా కు సంబంధించిన యాప్ లను నిషేధించడం కాంట్రాక్టులను  రద్దు చేయడం వస్తువులను నిషేధించడం చేసి ప్రపంచ దేశాలకు కూడా చైనా నిషేధానికి సంబంధించిన దారులు చూపించినట్టు జపాన్ పరిశోధకులు అభివర్ణించారు. ప్రస్తుతం భారత్ తో  పాటు వివిధ దేశాలు కూడా చైనా పై నిషేధం విధిస్తూన్న  నేపథ్యంలో  చైనాలో ఆహార సంక్షోభం కూడా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలా భారత్ రెండో రకం గా కూడా చైనాపై ఎంతో వ్యూహాత్మకంగా విజయం సాధించిందని జపాన్ పరిశోధకులు అంటున్నారు. ఇక మూడోది భారత భారత సైన్యాన్ని  చూసి చైనా సైనికులు ఏకంగా  భయపడే విధంగా భారత్ వ్యూహం అమలు చేసింది.


 గాల్వన్  ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అధికారిక లాంఛనాలతో ప్రజల గౌరవ మధ్య  అంత్యక్రియలు నిర్వహిస్తే చైనా సైనికులకు మాత్రం అది దక్కలేదు అని చెప్పాలి. అంతేకాకుండా భారత సైన్యం ప్రాణాలకు తెగించి మరి సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంది అనే విషయాన్ని చేతలతోనే చూపించింది... దీంతో  చైనా సైన్యం లో అభద్రతాభావాన్ని కలిగించింది భారత్. ఏకంగా మెమోరియల్ స్థాపించడంతో పాటు భారత సైన్యం దూకుడుగా వెళ్లడంపై కూడా చైనా సైన్యంలో  అభద్రతా భావాన్ని కలిగించడం వల్ల మరో రకంగా విజయం సాధించింది భారత్.  ఇలా చైనా పై భారత్ మూడంచెల విధానాన్ని అమలు చేస్తుందని ఇటీవల జపాన్ పరిశోధకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: