బీజేపీ రాజకీయంలో పవన్ ఇరుక్కుపోయాడే ?

తనకు ఉన్న పాపులారిటీతోనూ, సినీ అభిమానుల అండాదండాలతోనూ తిరుగులేని రాజకీయ నాయకుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం వచ్చినా, ఆ విధంగా మాత్రం పవన్ సక్సెస్ కాలేకపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన రాజకీయ వ్యూహాలు లేకపోవడం, అనుభవరాహిత్యం, తొందరపాటుతనం, ఇలా ఎన్నో కారణాలతో పవన్ మంచి పొలిటిషన్ గా సక్సెస్ కాలేకపోయారు. 2019 ఎన్నికల తరువాత కానీ పవన్ కు ఈ విషయం అర్థం కాలేదు.  అసలు అంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ముందుగా పవన్ ఊహించలేపోయారు. ఏదో రకంగా ఏపీకి సీఎం అవ్వాలనే కోరికతో పవన్ ఉండగా, ఇప్పుడు తమ మిత్రపక్షమైన బీజేపీ వైఖరితో పవన్ కు ఆ ఆశలు కూడా ఆవిరైపోతున్నట్లు గా కనిపిస్తున్నాయి.

బీజేపీతో పొత్తు పెట్టుకోగానే, పవన్ కు ఎక్కడలేని సంతోషం వచ్చినా, ఇప్పుడు ఆ పార్టీ వైఖరితో ఆ పార్టీలో ఉండలేక, బయటకు వెళ్ళలేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి పవన్ అవసరం కంటే జగన్ అవసరమే ఎక్కువగా ఉంది. ఏపీ సంగతి పక్కనపెడితే, జాతీయ స్థాయిలో మిత్రపక్షాలు బిజెపికి దూరమైపోతున్న క్రమంలో, అండగా నిలబడేందుకు  వైసిపి ఎంపీల అవసరం పవన్ కు చాలానే ఉంది. ఇక ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు ముందుకు వెళ్తున్న తీరు చూస్తుంటే, ఈ పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

 అమరావతి వ్యవహారాన్నే తీసుకుంటే, బీజేపీ ఒకరకంగా స్టేట్మెంట్లు ఇస్తే, జనసేన మరో రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో, మరింత గందరగోళం రెండు పార్టీల నాయకుల్లోనూ నెలకొంది. అసలు మిత్రపక్షంగా తాము అమరావతి కి మద్దతు ఇస్తూ ఉంటే, మీరు ఎందుకు మరోరకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని పవన్ బీజేపీని నిలదీసే సాహసం చేయడంలేదు. ప్రస్తుతం బీజేపీ వ్యవహారం చూస్తుంటే, పవన్ తో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కనీసం మిత్రపక్షం అన్న గౌరవం కూడా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారనే బాధ పవన్ తో పాటు, ఆ పార్టీ నాయకుల్లోనూ ఉన్నా, ఎవరూ బయటకి చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. అందుకే పవన్ ఒంటరిగానే అమరావతి ఉద్యమం చేపట్టేందుకు సిద్దమవుతుండటంతో, ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ మరింతగా పెరిగిందనే విషయం ఇప్పుడు అర్థమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: