ఒక్క విజయం తో కోహ్లీని వెనక్కి నెట్టిన వార్నర్..?

praveen
నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరు జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉండదు. ఏడవ స్థానంలో ఉన్న సన్రైజర్స్ 8వ స్థానంలో ఉన్న పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ అందరిలో ఉత్కంఠ రేపింది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఓపెనర్లు  పూర్తిగా పంజాబ్ బౌలర్ లపై ఆధిపత్యం సంపాదించారు అనే చెప్పాలి. మొదటి బాల్  నుంచి సిక్సర్లు, ఫోర్ లతో భారీ బౌండరీలు బాదుతూ మొదలుపెట్టారు. ఇద్దరు ఓపెనర్లు కూడా ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ.. భారీ బౌండరీలు బాదారు. ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు భారీ సిక్సర్లు బాదుతుండటంతో... సన్ రైజర్స్ ఓపెనర్లను ఎలా కట్టడి చేయాలో తెలియక పంజాబ్  బౌలర్లు తికమక పడి పోయారు అని చెప్పాలి.



 నిన్న పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి దూసుకుపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. నిన్న జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది అనే చెప్పాలి. ఇక గతంలో ఇదే మైదానంలో పంజాబ్ జట్టు కెప్టెన్ ఓపెనర్ కె.ఎల్.రాహుల్ 132 పరుగులు చేసిన రికార్డు ఉండడంతో ఈ సారి కూడా విజృంభించి ఆడతాడని  క్రికెట్ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి కె.ఎల్.రాహుల్ నిలవలేకపోయాడు.



 కేఎల్ రాహుల్ చేసిన తప్పిదం మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ను  రన్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ జట్టు 17ఓవర్ లు  ముగియకముందే ఆలౌట్ అయ్యి  132 పరుగులకు మాత్రమే పరిమితమైంది. నిన్నటి విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా  విరాట్ కోహ్లీ జట్టును వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక భారీ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు అందరూ ఫుల్ ఖుషీ అయ్యారు అని చెప్పాలి. ఐపీఎల్ ప్రారంభం నుంచి సరైన విజయం లేక నిరాశలో ఉన్న అభిమానులకు అందరికీ.. నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సరికొత్త ఉత్సాహం నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: