చంద్రబాబు అరుపుల వల్ల ఒరిగేది శూన్యం.. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు..?
ఈ క్రమంలోనే తనకు అవసరం లేకున్నా టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను తన చెంతకు చేర్చుకున్నారు. అయితే గతంలో చంద్రబాబు చేసిన విధంగా కాకుండా ప్రజలు గమనిస్తున్నారన్న అంశం పరిగణలోకి తీసుకుని ఎంతో పారదర్శకంగా అయన ఆ నేతలను తన పార్టీ లో చేర్చుకున్న విధానం చూసి ప్రజలు కొత్త తరహా రాజకీయం చేస్తున్న జగన్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు.. ఇక ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఓ ఇద్దరు నేతలు వైసీపీ లోకి రావడానికి ఎంతో ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తుంది.
అయితే జరిగిన ప్రతిఘటనను తమకు మైలేజీగా వాడుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడిగా అనుంగు మీడియా ఇచ్చిన కలరింగ్ ఇప్పుడు లేదు. అక్కడెక్కడో చక్రం తిప్పడం మాట అటుంచితే ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ, ఆ మాటకొస్తే ఏపీ ఒక్కచోటా కూడా అంతంత మాత్రంగానే చక్రం తిరుగుతోంది. ఉదయం కాగానే రాష్ట్రంలో ఏ పక్క నుంచి నాయకుడు పక్కపార్టీకి జారిపోతాడో అనే శంకతోనే నిద్ర లేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటప్పుడు చౌకబారు ఆరోపణలు పదేపదే చేసే బదులు సరైన సమస్యను, తగు ప్రణాళికతో లేవనెత్తి ప్రజల ముందుకువెళితే తప్ప చంద్రబాబు, టీడీపీలను గురించి జనం ఆలోచించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు బలంగానే విశ్వసిస్తున్నారు.