రఫెల్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. రివర్స్ కామెంట్స్ వైరల్..?

praveen
మొదట్లో ఒక రాజకీయ వ్యూహకర్తగా.. రాజకీయ చాణక్యుడిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మాత్రం ఒక అవకాశవాద రాజకీయ నాయకుడిగా క్రమక్రమంగా పేరు తెచ్చుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోన్న  విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తన రాజకీయ చతురతను వదిలేసి అవకాశవాద రాజకీయం వైపు అడుగులు వేయడం కారణంగానే.. ఘోర ఓటమి చవిచూశారు అని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరో సారి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి.




 గతంలో రఫెల్ యుద్ధ విమానాల విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం మొత్తం  వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిండి  అంటూ కాంగ్రెస్ పక్షాన నిలిచిన చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  మోదీ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో  వుండకూడదు అనేవిధంగా విమర్శలు చేశారు. అయితే ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా.. రఫెల్  యుద్ధ విమానాలు విషయంలో కుంభకోణం విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేరు అంటూ విమర్శలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల రఫెల్ యుద్ధ విమానాలు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి.



 ఇటీవలె భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశీ రఫెల్ యుద్ధ విమానాలు స్వదేశీ తేజస్సు విమానాలు భారత అమ్ములపొదిలో చేర్చుకొని మరింత శక్తివంతమైన భారత వైమానిక దళం దేశానికి గర్వకారణం.. వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తున్న వీరులకి  వారి కుటుంబానికి గౌరవ వందనం అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఇక బాబుగారి వ్యాఖ్యలపై నెటిజన్లు  పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. ఒకప్పుడు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రఫెల్ యుద్ధ విమానాలు తీసుకొచ్చి గొప్ప పని చేశారు అంటూ సమర్ధించడం అవకాశవాద రాజకీయానికి మారుపేరు అని నెటిజన్లు  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: