జేసీ కి గతమెందుకు గుర్తుకులేదో ?

కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా కీలక నాయకులైన జేసీ కుటుంబాన్ని టార్గెట్ గా చోటు చేసుకుంటున్న పరిణామాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జేసీ దివాకర రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి తప్పుడు పత్రాలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారు అనే అభియోగాలతో, ఆయన పైన, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పైనా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలై వారు బయటకు వచ్చారు. ఇవే కాక జేసీ కుటుంబం నిర్వహిస్తున్న ట్రావెల్స్ వ్యాపారంపైన ఇదే విధమైన కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చేస్తోందంటూ, జేసీ బ్రదర్స్ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జేసీ బ్రదర్స్ వ్యాపార సామ్రాజ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. వారు ఏం చెప్తే అది జరిగిపోయేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీదే పెత్తనం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఇదంతా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిపోయింది.జేసీ బ్రదర్స్ అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉండడంతో, వరుసగా వారిపై కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. దీంతో తమ పై కక్ష సాధింపు చేస్తోందంటూ జేసీ బ్రదర్స్ ఆరోపణలు చేస్తున్నారు.


తాజాగా మీడియా ముందుకు వచ్చిన దివాకర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమపై కావాలనే కక్ష సాధిస్తున్నారని, గనుల వ్యాపారం మూయించాలి అని చూస్తున్నారని, అదే లేకపోతే అన్నం తినే పరిస్థితి లేదని, ఆకలితో మాడి చావాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇదంతా జేసీ బ్రదర్స్ స్వయంకృతాపరాధం గానే ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జేసీ బ్రదర్స్ ఎంతో మందిని అక్రమంగా జైలుకు పంపించారని, ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, వారు చేసిన తప్పులే వారికి ఇప్పుడు శాపంగా మారాయనే విమర్శలు జేసీ బ్రదర్స్ పై పెరిగిపోతున్నాయి.


అలాగే గతంలో జగన్, ఆయన తల్లి పైనా ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారో ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. ఇప్పుడు జేసీ బ్రదర్స్ కక్షసాధింపు అనుకున్నా, గతంలో వారు చేసిన తప్పిదాలకు తగిన ఆధారాలు ఉండబట్టే జైలు పాలు అయ్యారు.. ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని జెసి బ్రదర్స్ మరిచిపోయినట్టుగా ఉన్నారనే విమర్శలు ఇప్పుడు వారిపై వస్తున్నాయి. ఏ తప్పు చేయకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేసినా, దానికి విలువ ఉండేది. కానీ , వారు పదవుల్లో ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించారో జనాలకు తెలియంది కాదు అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: