శాడిస్టు తల్లి.. మూడు నెలల చిన్నారికి పాలలో పురుగుల మందు కలిపి.. చివరికి..?
ఇక్కడ ఇలాంటి మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లి ఏకంగా ఆ బిడ్డ పాలిట కాల యముడు గా మారిపోయింది. ఏ కష్టం రాకుండా తన ఒడిలో రక్షణ కల్పించాల్సిన తల్లి చివరికి ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది . ఈ విషాదకర ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... విల్లుపురం పాపన్ కులం ప్రాంతానికి చెందిన సాదిక్ భాష, యాస్మిన్ దంపతులకు కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే యాస్మిన్ మూడు నెలల క్రితం ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే శిశువుకు పాలిచ్చి నిద్రపుచ్చింది.
ఇక ఆ తర్వాత రోజు ఉదయం సమయంలో శిశువు స్పృహ కోల్పోయి ఉండడంతో కంగారుపడి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు ప్రాణాలు వదిలినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే శిశువు మృతి చెందడంపై అనుమానం వచ్చిన భర్త సాదిక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. ఇక శిశువు పోస్టుమార్టం రిపోర్టులో.. చిన్నారి తాగిన పాలల్లో విషం కలిపినట్లుగా నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం భర్త ఉపాధి కోల్పోయి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఆడ శిశువు జన్మించడం తో తల్లి యాస్మిన్ శిశువుకు పాలలో పురుగుల మందు కలిపి దారుణంగా చంపేసినట్లు పోలీసు విచారణలో తేలింది.