దుబ్బాక ఉపఎన్నికలలో గెలుపుపై కేసీఆర్ ధీమా
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి విషయాలను మరియు తాను చేయించిన సర్వేలకు సంబంధించిన అంశాలు గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత మంచి మెజార్టీతో గెలవనున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాముచేయించిన తాజా సర్వేల్లో 74 శాతం మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లుగా సమాచారం. ఇదే కనుక కొనసాగితే టిఆర్ఎస్ మరింత పట్టు సాధించి ఎన్నికల్లో నెగ్గుకు రావడం ఖాయం.
దుబ్బాక ఉప ఎన్నికలోనే కాదు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ వందకు పైగా స్థానాల్ని సొంతం చేసుకోనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్ త్వరలో జరిగే పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవనున్నట్లు పేర్కొన్నారు. విపక్షాలు మాటకొస్తే టిఆర్ఎస్ ను ఢీ కొట్టడం కష్టమే అని చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ మాటల శైలిని చూస్తుంటే తెలంగాణలో తమను ఢీకొట్టే విపక్ష పార్టీ లేదన్న... ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది.. కేసీఆర్ సర్వే రిపోర్టులకు తగ్గట్లే.. ఎన్నికల ఫలితాలు ఏ రకమైన సమాధానం ఇవ్వనున్నాయో వేచి చూడాలి.