విజయసాయి ట్రాప్ అదిరిపోతుందిగా...

M N Amaleswara rao
విజయసాయిరెడ్డి...అధికార వైసీపీలో కీలక నాయకుడు. రాజ్యసభ్యుడుగా ఉన్న విజయసాయి వైసీపీ కోసం ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  వైసీపీకి వెనుక ఉండి ఆ పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తుంటారు.  అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా బాబుపై విమర్శలు చేస్తూ, తన పార్టీని పైకి లేపే ప్రయత్నం చేస్తారు.

అయితే ఇక్కడే విజయసాయి ఓ ట్రాప్ సెట్ చేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే విజయసాయి ఎప్పుడు బాబుపై విమర్శలు చేస్తే, వెంటనే టీడీపీ నేతలు లైన్‌లోకి వచ్చేసి విజయసాయికు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఇదే విజయసాయి ట్రాప్ అని తెలుస్తోంది. మామూలుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తే దానికి వైసీపీ కౌంటర్లు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ విజయసాయినే ఓ టార్గెట్ చేసి పెడతారు. ఆ ట్రాప్‌లో టీడీపీ నేతలు పడేలా చేస్తారు.

ఇంకా వేరే పని ఏమి పెట్టుకోకుండా టీడీపీ నేతలు విజయసాయి చుట్టూనే తిరుగుతారు. తాజాగా విజయసాయి సోషల్ మీడియా వేదికగా అమరావతికి చెందిన ఓ రైతు చనిపోయిన అంశాన్ని తీసుకొచ్చి, అది సహజమరణం అని, దాన్ని కూడా అమరావతి ఖాతాలో వేసి లబ్ది పొందాలని చూస్తున్నారని చంద్రబాబు, లోకేష్‌లకు చురకలు అంటించారు.

ఇలా విజయసాయి ఓ ట్రాప్ రెడీ చేయగానే, టీడీపీ నేతలు అందులోకి వచ్చి పడ్డారు. వరుసపెట్టి టీడీపీ నేతలు ఆయనకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు వేరే పని ఏమి పెట్టుకోకుండా విజయసాయికి కౌంటర్లు ఇవ్వడంలోనే రోజంతా గడిపేస్తారు. దీంతో రాష్ట్రంలో వేరే సమస్యలు ఉంటే అవన్నీ సైడ్ అయిపోతాయి. కావాలనే విజయసాయి ఇలా ట్రాప్ సెట్ చేసి టీడీపీ నేతలని డైవర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా విజయసాయి ట్రాప్ అదిరిపోతుందనే చెప్పొచ్చు. అందులో పడి టీడీపీ నేతలు పూర్తిగా బుక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: