సీఎం జగన్ కు బిగ్ షాక్ ? సుప్రీంకోర్టులో పిటీషన్..!
ఈ పిటీషన్ వేసిందెవరంటే.. న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ అనే ఆయన అట. న్యాయమూర్తులు, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా జగన్‌ను నిలువరించాలని సదరు సునీల్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయస్థానాలను కించపరచినందుకు జగన్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని సునీల్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగం ప్రకారం.. పార్లమెంట్, శాసనసభల్లో న్యాయమూర్తులపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించకూడదట. ఆ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన జగన్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. ఆయన గీత దాటాడు. నిజంగాన్యాయవ్యవస్థ గాడి తప్పుతుందని, జగన్ నిజంగా భావించి ఉంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సిందంటున్నాడాయన. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించిన నేపథ్యంలో జగన్ చర్యలు చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. భవిషత్తులో జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్లో సునీల్ కుమార్ కోరారు.
అంతే కాదు.. ఈ జగన్ న్యాయమూర్తులను భయపెడుతున్నాడు. దీనివల్ల న్యాయస్థానాలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడే ప్రమాదముంది. చీఫ్ జస్టిస్‌కు పంపిన ఫిర్యాదులోని అంశాలను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించడం నేరం.. అందుకే.. భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించకుండా చూడాలి అంటూ సునీల్ కుమార్ కోరారు. ఏపీ సీఎంపై ఎందుకు చర్య తీసుకోకూడదో వెల్లడించేలా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు సునీల్ కుమార్.