భూత వైద్యం పేరుతో బాలికకు మత్తుమందు.. చివరికి..?

praveen
ఈ మధ్య కాలంలో మహిళల పై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్న  విషయం తెలిసిందే. ఎన్ని  జాగ్రత్తలు తీసుకున్నప్పటి కీ ఏదో ఒక విధంగా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. కామంతో కళ్లు మూసుకు పోయిన ఆడపిల్లల పై అత్యాచారం చేసే వాళ్ళు కొంత మంది అయితే దొంగ బాబాల పేరుతో మూఢనమ్మకాలు కలిగిన వారిని నమ్మించి మోసం చేసి చివరికి అత్యాచారాలు చేస్తున్న వారు మరి కొంతమంది. వెరసి ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు  పెరిగిపోతూనే ఉన్నాయి.

 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూత వైద్యం పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు  దొంగ బాబా ముసుగులో ఉన్న నీచుడు. వెంటనే అప్రమత్తమైన మహిళలు చెప్పులు చీపుర్లతో దొంగ బాబాను చితకబాదారు. ఇక బాలికకు కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఈ దారుణ ఘటన నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నగరంలో భూత వైద్యం పేరుతో మహిళల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ అత్యాచారానికి పాల్పడుతూన్న  దొంగ బాబాకి  దేహశుద్ధి చేశారు మహిళలు.

 గతంలో కూడా ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మెడిటేషన్ పేరుతో పిల్లలకు ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పి తల్లిదండ్రులను నమ్మిస్తున్నాడని  ఆ తర్వాత పిల్లలకు శిక్షణ పేరుతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారాలకు పాల్పడుతున్నాడు  అంటూ ఎంతో మంది బాధితులు వాపోతున్నారు. వైద్యం పేరుతో వారి నుంచి భారీగా నగదు కూడా వసూలు చేసిన్నట్లు చెబుతున్నారు. ఇక బాధిత బాలిక మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయాన్ని తెలిపి బోరున విలపించింది. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దొంగబాబు అరెస్టు చేసి కటకటాల వెనుకకు తోశారు. దొంగ బాబా గుట్టు  గట్టు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: