కాలమయ్యింది అనుకుంటే.. కరువొచ్చినట్లుంది.. రైతన్న ఆవేదన..?
ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్రామాల్లో రైతుల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా మారింది. ఈ వర్షాకాలం లో కురిసిన వర్షాలకు ఈ ఏడు కాలం అయ్యింది అని.. ఎంతో సంతోష పడిపోయిన రైతన్నల అందరూ.. ఆనందం లో బీడు ఉన్న భూముల్లో సైతం పంటలు వేశారు. ఈ ఏడాది అయిన పంట దిగుబడి ఎక్కువగా వస్తే కాస్త అయినా లాభం సంపాదించుకుని అప్పులు తీర్చుకోవాలి అనుకున్నారు. ఏడాది వర్షాకాలం లో కురిసిన వర్షాలతో సంతృప్తిగా ఉన్న రైతన్నలు... వర్షాకాలం ముగిసినప్పటికీ ఇప్పటికి కూడా కురుస్తున్న వర్షాలతో మాత్రం బెంబేలెత్తిపోతున్నారు.
గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలకు ఆవేదనలో మునిగిపోయారు. ఈదురుగాలుల తో కూడిన వర్షం కురవడంతో ప్రస్తుతం చేతికొచ్చిన పంటలు మొత్తం నేలకు ఒరిగిపోయి ధ్వంసమయ్యాయి. అంతే కాకుండా పూర్తిగా నీటిలో మునిగిపోవడం తో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇక పూర్తిగా నీట మునిగిన పంట తో ఏం చేయాలో అర్థంకాని దీనస్థితి లో మునిగిపోయాడు రైతన్న. చేతికొచ్చిన పంట ధ్వంసం కావడంతో తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయాడు.