అయ్యో పాపం.. నగరంలో ఆగని వర్షాలు.. దొరకని శవాలు..
గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. వరద నీటిలో చిక్కుకొని ప్రాణాలను కాపాడమని వేడుకుంటున్నారు.ఇప్పటికీ వరుణుడు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు.భారీ వర్షాలకు ఇల్లులు, గోడలు కూలి పలువురు మృత్యువాత పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ పాత ఇల్లు పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నాగర్ కర్నూలు మండలం, కుమ్మెర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని హనుమంతరెడ్డితో పాటు అతని భార్య అనసూయమ్మ, మనుమడు హర్షవర్థన్ రెడ్డి మృతి చెందారు.
హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న పాత ఇల్లు నేలమట్టం అయ్యాయి. చాంద్రాయణగుట్టలో కూడా ఇలాంటి విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వర్ష బీభత్సానికి గౌస్ నగర్లో రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో కొట్టుకు పోయిన వారు వేరే ప్రాంతాల్లో మృతులుగా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నా కూడా వరద ఉద్రిక్తతకు ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలను తెగించి పోలీసులు, ఎన్డీఏ బృందాలు కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం చీకటిలో కొనసాగుతుంది. వర్షాలు ముగిసే లోపు సగం హైదరాబాద్ ఖాళీ అవుతుందేమో అని ప్రజలు భయపడుతున్నారు.