ప్రాణం తీసిన పానిపూరి..ఎక్కడంటే?
పానిపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో..అది ఎలా ఉన్న ఎక్కడ తయారు చేస్తున్న కూడా చాలా మంది ఇష్టపడతారు. అందుకే పానీ పూరీకి అంత డిమాండ్ ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేయడంతో పానిపూరీ కి మళ్లీ డిమాండ్ పెరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ పానీపూరి బండ్లు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. నీళ్లతో తయారు అయ్యే ఈ పానిపూరి అనేక రకాల జబ్బులను కలగ జేస్తుందని వైద్యులు చెప్పిన కూడా ఈ మనుషులు వినరు. అదే ఇప్పుడు ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అబ్దుల్లా పూర్ మెట్ మండల పరిధిలో ఈ ఘటన చోట చేసుకుంది.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి.గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లో తట్టు ప్రాంతాల తో పాటుగా రోడ్లన్నీ కూడా నీటితో నిండాయి. భారీగా వస్తున్న వరద నీళ్లు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయిన వినకుండా వచ్చిన టీనేజీ కుర్రాళ్ళు ప్రాణాలను కోల్పోయారు.
అబ్దుల్లా పూర్ మెట్ మండల పరిధిలోని ఇంజపూర్ వాగులో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా ఇళ్ళ నుంచి బయటకు వచ్చారు.ప్రణయ్, సందీప్ ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం పానీపూరి తినేందుకు తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు వెళుతుండగా వాగులో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా మార్చురీకి తరలించారు.మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చూసారుగా హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు రాకండి...