బిజెపిలోకి కుష్బూ.. 50 కేసులు పెట్టిన దివ్యాంగుల సంఘం..?
ఇక ఆ తర్వాత ఇటీవలే బీజేపీ లోకి రావడం సంచలనం గా మారిపోయింది. బీజేపీ లోకి రావడంతో తమిళనాడు రాజకీయాలు మరింత దూకుడుగా మారిపోయాయి. ఎందుకంటే ఖుష్బూకి ఇక తమిళనాడులో ఎంతో క్రేజ్ వుంది అన్న విషయం తెలిసిందే. తమిళనాడులో 2021లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుష్బూ రాకతో బిజెపికి మరింత బలం చేకూరింది అని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. అయితే కేంద్రం తీసుకువచ్చిన కొత్త విద్యా పాలసీ నచ్చినందుకే తాను బీజేపీలో చేరుతున్నానని... కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు తనను ఆకర్షించాయి అంటూ కుష్బూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే బిజెపి పార్టీలో చేరిన కుష్బూ పై ఏకంగా 50 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. తమిళనాడు లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 పోలీస్స్టేషన్లలో కుష్బూ పై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరుతున్న సమయంలో కాంగ్రెస్ కు మేధో వైకల్యం ఏర్పడిందంటూ వ్యాఖ్యానించిన కుష్బూ కాంగ్రెస్ నేతలందరూ వికలాంగులు అన్న విధంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుష్బూ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి అంటూ దివ్యాంగుల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత కుష్బూ క్షమాపణలు కోరుతూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.