పిల్లల్ని కనండి ప్లీజ్.. డబ్బులు కూడా ఇస్తాం.. బంపర్ ఆఫర్?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటి జీవనశైలికి ప్రస్తుత జీవనశైలికి ఎంతో తేడా ఉంది. అయితే జీవనశైలిలో మార్పులు రావడమే కాదు కొన్ని కొన్ని అనర్థాలు కూడా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది విద్యావంతులు అవుతున్న నేపధ్యంలో రోజురోజుకు అందరిలో మరింత మేధోసంపత్తి పెరగడమే కాదు ఆ మేధోసంపత్తి కారణంగా అంతర్మథనం మొదలై కొన్ని కొన్ని సార్లు సమస్యలకు కూడా దారితీస్తుంది.



 ప్రస్తుతం అందరిలో అవగాహన పెరిగి పోయి మంచి చదువులు చదివి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు అందరూ  ఈ క్రమంలోనే సాధారణ జీవనశైలి ని మర్చిపోయి ఆధునిక జీవనశైలి వెంట పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది  జీవన శైలిలో పెళ్లి పిల్లలు అనే దానికి ఎక్కువ విలువ ఇవ్వడం లేదు. లైఫ్ లో బాగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న ఎంతోమంది 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఆ తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఎంతో సమయం తీసుకున్నారు.




 ఇక దాంపత్య జీవితంలో సరైన శారీరక బంధం లేకపోవడంతో కొన్ని జంటలు విడిపోతుంటే మరికొన్ని మాత్రం... ఏదో ఒక విధంగా దాంపత్య బంధం అనే బండిని నెట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని దేశాలలో అయితే జననాల రేటు భారీగా తగ్గి పోతుంది. అయితే ఇప్పుడు వరకు మన దేశంలో ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి  అంటూ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి  కానీ సింగపూర్ దేశంలో  మాత్రం పిల్లలను కనండి  అంటూ అక్కడి ప్రజలను వేడుకుంటున్నాయి ప్రభుత్వాలు. సింగపూర్లో జననాల రేటు రోజు రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో పిల్లలను కంటే ఏకంగా 3వేల   డాలర్లు బహుమతిగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇది  చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: