బీహార్ ఎన్నికల వేడి.. రంగంలోకి మోడీ..?

praveen
బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్ మహాశయులకు అందరిని ఆకట్టుకోవడమే పనిగా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక బీహార్ లో మరోసారి ఎన్డీఏ కూటమికే అధికారం దక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ప్రచార రంగంలోకి దిగి ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తక్కువ మోతాదు లోనే ప్రచారం నిర్వహించేందుకు అనుమతి  ఉన్న నేపథ్యంలో... ప్రస్తుతం ఓటర్ మహాశయులకు ఆకట్టుకోవడానికి ఎన్నో హామీల వర్షం కురిపిస్తున్నారు.


 ఈసారి ఎలాగైనా ఎన్డీఏ కూటమి ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చేపట్టదలచిన అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి కూడా వివరిస్తూ అధికార పార్టీ అసమర్థతను  ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి  ప్రతిపక్ష పార్టీలు. ఈ క్రమంలోనే బీహార్ ఎన్నికల నగారా మోగే లోపే ఓటర్ మహాశయులకు ఆకట్టుకుని  తమవైపు తిప్పుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి.

 ఇక బీహార్ ఎన్నికల ప్రచారంలో కి బీజేపీ పెద్దలు కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల్లో  12 ర్యాలీల్లో  ప్రచారం నిర్వహించేందుకు మోడీ  సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని బీహార్ ఎన్నికల ప్రచార బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్న దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు. ఈ నెల 23, 28, నవంబరు 1, 3 తేదీల్లో బీహార్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీలు సభల్లో  కూడా మోదీ పాల్గొని ప్రచారం నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇక మోడీ మోడీ  ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: