కోమాలో నుండి కోలుకున్న వ్యక్తి ఓ విషయం చెప్పడంతో.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!!
పూర్తి వివరాలు తెలుసుకుంటే డిసెంబర్ 2010 లో షౌవిక్ ఛటర్జీ తన కాలేజీ ఫ్రెండ్స్ అయిన శశాంక్ దాస్, జితేంద్ర కుమార్ లతో కలిసి బెంగళూరులోని ఒక గదిలో రెంట్ కి ఉండేవాడు. వీళ్ళ ముగ్గురు కూడా అస్సాం, ఒడిస్సా వంటి ఇతర రాష్ట్రాల నుండి చదువుకోవడానికి బెంగళూరు కి వచ్చారు. అయితే షౌవిక్ ఒక అమ్మాయిని ఇష్టపడేవాడు. శశాంక్ కూడా అదే అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఈ అమ్మాయి విషయంలోనే వీళ్ళిద్దరికి తరచూ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలోనే శశాంక్, జితేంద్రకుమార్ కలిసి షౌవిక్ ని చంపాలని మూడవ అంతస్తు పై నుండి కిందకు తోసేశారు ప్రయత్నించారు. దీంంతో షౌవిక్ తలకు గాయం కావడంతో కోమా లోకి వెళ్ళాడు.
ఈ సంఘటన 10 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఇద్దరు నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నిందితుడు శశాంక్ ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుండగా, జితేంద్ర బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బాధితుడైన షౌవిక్ ఇప్పుడు కోల్కతాలో నివసిస్తున్నాడు. ఏది ఏమైనా షౌవిక్ తనపై జరిగిన దాడిని చక్కగా వివరించలేకపోయినట్లయితే ఇద్దరు ద్రోహులు చట్టం నుండి తప్పించుకునే వారు.