తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త.. మీ పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది..?
భారీ వర్షం నుంచి నగరం ఇంకా తేరుకోలేక పోతుంది అనే విషయం తెలిసిందే. నాళాలు ఎక్కడికక్కడ పొంగి మురికి నీరు మొత్తం బయటకు రావడంతో నగరవాసులు పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది. ఎటు చూసినా పూర్తిగా నీరు నిండిపోవడం ఇలా జనావాసాల్లోకి మురికి నీరు రావడంతో ఆ దుర్వాసనతో కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అల్లాడిపోయారు. ఈ క్రమంలోనే భారీ వరదనీటితో ఏకంగా పెద్ద పెద్ద చెరువులను తలపించాయి హైదరాబాద్ నగర రోడ్లు. అంతేకాదు వరదల్లో చిక్కుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసి అధికారులు పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తూ వరదలు వస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. నగరంలో భారీగా వరద ఉన్న నేపథ్యంలో చిన్న పిల్లలను నిర్లక్ష్యంగా బయటికి వదల వద్దని... వరదల కారణంగా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. అంతేకాకుండా భారీ వర్షాల నేపథ్యంలో అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు జిహెచ్ఎంసి అధికారులు.