భారీ వరదలు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ప్రజలు..?

praveen
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యం లో వచ్చిన వరదలు హైదరాబాద్ నగరాన్ని మొత్తం ముంచెత్తినా విషయం తెలిసిందే. దాదాపుగా భాగ్య నగరంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యి  జలదిగ్బంధంలో కి వెళ్లి పోయాయి. ఎన్నో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాళాలు  పొంగి పొర్లడంతో  దిక్కుతోచని స్థితిలో వరద  నీటిలోనే దుర్భర జీవితాన్ని గడిపారు భాగ్యనగర వాసులు. అయితే ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న ప్రజలందరికీ సహాయక చర్యలు చేపడుతున్నారు జిహెచ్ఎంసి అధికారులు. అయితే భారీ వరదల కు కారణాలు ఏంటి అనే దానిపై కూడా దృష్టి సారిస్తున్నారు.

 ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో నాళాలపై  కట్టిన అక్రమ కట్టడాల కారణంగానే... భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇలా అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో కి వెళ్లి పోయి జనావాసాల్లోకి నీరు చేరుతుంది అని తెలంగాణ పురపాలక శాఖ గుర్తించింది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే.టి.ఆర్ అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని వెంటనే నేలమట్టం చేయాలి అంటూ అధికారులకు ఆదేశించారు. మంత్రి కేటీఆర్ చెప్పిందే తడవుగా అధికారులు శరవేగంగా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ప్రజలు అధికారులకు ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చారు. వరదలకు కారణమైన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధం నేపథ్యంలో... చెరువులు నాళాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇల్లు కూల్చేస్తున్న తరుణంలో.. ప్రజలు కోర్టులను  ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కేటీఆర్ ప్రకటన ఆచరణలో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో నాళాలకు అడ్డంగా 384 ఇల్లు కట్టుకున్నారు. ఇక వీటిని కూల్చేందుకు ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలో ఎనభై నాలుగు కుటుంబాలు ఏకంగా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. భాగ్యనగరంలోని ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: