అచ్చం చంద్రబాబు లాగానే నితీష్ ని కూడా అంటున్నారుట...?

Satya
బీహార్ ఎన్నికలు ఇపుడు జోరందుకున్నాయి. మరో ఎనిమిది రోజుల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎవరి జాతకాలు ఏంటి అన్నది జనం తేల్చనున్నారు. ఇక బీహార్ లో ఈసారి అధికార పీఠం ఎవరికి దక్కనుంది అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. ఈసారి వీరికి అధికారం గ్యారంటీ అని సర్వేలు కూడా చెప్పలేకపోతున్నాయి. ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఉంది. అదే సమయంలో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతోంది.
ప్రముఖ దళిత నేత, లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఈ మధ్యనే  మరణించడం, ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వేరు కుంపటి పెట్టడంతో దళితుల ఓట్లు ఎటు వెళ్తాయో అన్న కంగారు కూడా ఉంది. ఇంకో వైపు మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజశ్వి యాదవ్ కూడా మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన ఈసారి ఎలాగైనా అధికార పీఠం పట్టాలన్న కసితో ఉన్నారు. ఆయన మాటలు, ప్రసంగాలు కూడా బాగా రాటుతేలాయి.
ప్రత్యేక హోదాని బీహార్ కి అడగడంలేదేంటి అంటూ నితీష్ ని నిలదీసిన తీరు అందరికీ నచ్చుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి బీహార్ కి హోదా ఇవ్వమని మాట్లాడుతారా అంటూ తేజశ్వి వేస్తున్న సెటైర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక బీహార్ లో నిరుద్యోగ యువత చాలా ఎక్కువగా  ఉన్నారు. వారు మార్పు కోరుకుంటున్నారు. దాంతో వారిని దగ్గరకు చేర్చుకునేందుకు తేజశ్వి యువ నేతగా అవతరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాలను ఒకేసారి ప్రభుత్వ పరంగా ఇస్తామని చాలా పెద్ద హామీనే ఆయన ఇచ్చేశారు.
ఇక ఆయన నితీష్ కుమార్ గురించి చేస్తున్న విమర్శలు 2019 ఎన్నికల్లో ఏపీలో  చంద్రబాబు ఎదుర్కొన్నలాంటివే కావడం విశేషం. నితీష్ కుమార్ ఎన్నాళ్ళు పాలిస్తారు మీరు  బాగా అలసిపోయారు. ఇక విశ్రాంతి తీసుకోండి అంటూ తేజశ్వి విసురుతున్న విసుర్లు కూడా ఏపీ రాజకీయాన్ని తలపిస్తున్నాయి. నాడు చంద్రబాబు వయసుని చూపించే వైసీపీ నేతలు బాగా సొమ్ము చేసుకున్నారు ఒక్కోసారి, అనుభవం వయసు కూడా మైనస్ అవుతాయని ఏపీ ఎన్నికలు నిరూపించాయి. అందుకే తేజశ్వి అలా మాట్లాడుతున్నారు. దాంతో ఇపుడు బీహార్ ఓటర్లు నితీష్ సీనియారిటీకి పట్టం కడతారా లేక యువ నేత తేజశ్వి యాదవ్ ని సీఎం ని చేస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: