కరోనాపై జగన్ కీలక నిర్ణయం...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రతపై ఇప్పుడు సర్వత్రా కూడా కాస్త ఆందోళన ఉంది. కరోనా తగ్గినట్టే తగ్గి పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. దీంతో సీఎం జగన్ కూడా చాలా వరకు జాగ్రత్తగా నిర్వహిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అధికారులతో కూడా ఆయన వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి వారికి పలు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టులు ఏ రాష్ట్రంలో చేయని విధంగా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా సరే యాక్టివ్ కేసుల మీద ఎక్కువగా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
దీనితో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. త్వరలోనే మరిన్ని తగ్గే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రతకు సంబంధించి సీఎం జగన్ మరియు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.  ముఖ్యంగా చలికాలంలో కరోనా కేసులు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో టెస్ట్ లకు సంబంధించిన ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గానికి మూడు నాలుగు బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లో కరోనా టెస్టులు వేగంగా చేయవచ్చని సీఎం భావిస్తున్నట్లు సమాచారం.  వాలంటీర్ ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అడుగులు ముందుకు వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారితో పాటు మంత్రులు కూడా దీనిపై కసరత్తు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది అనేది చూడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రాష్ట్రానికి సహాయం చేయాలని సీఎం  జగన్ కోరుతున్నారు. నేడు పరీక్షల విషయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: