దేశీ స్టాక్ మార్కెట్స్ లాభాలకి చెక్.. నేడు నష్టాల్లో ముగిసిన మార్కెట్స్..!

Kothuru Ram Kumar
భారీ లాభాలతో దూసుకెళ్తున్న భారతీయ స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు ప్రభుత్వ ప్యాకేజీ పై ఉన్న సందేహాలతో అమెరికా మార్కెట్స్ డీలా పడడంతో దాని ఎఫెక్ట్ భారతదేశ మార్కెట్ పై కూడా కనిపించింది. దీంతో రోజు మొదలైనప్పటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగానే కదిలాయి. దీంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మార్కెట్ సమయం ముగిసే సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టపోయి 40558 పాయింట్ల వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11896 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది వరకు భారీ లాభాల్లో కొనసాగిన కంపెనీల వల్ల ట్రేడర్స్ లాభాలు స్వీకరించడంతో అమ్మకాలకు దిగడంతో నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఇక నిఫ్టీ సెక్టోరల్ లో ఫార్మా, ఐటీ, పిఎస్ యు, ఆటో ఇలా అన్ని రంగాలు కూడా నష్టాల బాట పట్టాయి.

ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే.. ముందుగా అత్యధికంగా లాభపడిన వాటిలో ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఐఓసి కంపెనీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇందులో అత్యధికంగా ఎన్టిపిసి 2.86 శాతం లాభపడింది. ఇక మరోవైపు అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే ఇండస్ లాండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, సిప్లా అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఇండస్ లాండ్ బ్యాంక్ 3.08 శాతం నష్టపోయింది.

ఇక నేడు హైదరాబాద్ మహానగరంలో బంగారం ధరల విషయానికొస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 160 రూపాయలు పెరిగి రూ. 51,490 వద్ద ముగిసింది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 47, 200 రూపాయల వద్ద ముగిసింది. ఇక బంగారం పెరిగితే వెండి మాత్రం కాస్త డీలా పడింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 500 రూపాయలు తగ్గి 63 వేల రూపాయలకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: