మోడీ సర్కార్ కీ భారీ షాక్.. చైనాతో పోలిస్తే.?

praveen
కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా మారుతూ  అగ్రరాజ్యాలకు సైతం పోటీ ఇచ్చే విధంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి రావడంతో.. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగానో క్షీణించింది. అయితే కేవలం భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు దాదాపుగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా క్రమక్రమంగా క్షీణించిపోయింది. కరోనా  వైరస్ నుండి  చైనా తొందరగా కోలుకోవడం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎక్కువగా దెబ్బతినలేదు అనడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ఇటీవలే ఓ నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ  ఎంతో శక్తివంతమైన దేశాల నుంచి మధ్యస్థ శక్తివంతమైన దేశాల జాబితాలో కి వెళ్ళిపోయింది అన్నది వెల్లడయింది. ఒక్కసారిగా ప్రపంచ శక్తివంతమైన దేశాల జాబితా నుంచి భారత్ ఆర్థికంగా వెనక్కి నెట్టివేయబడింది అని ఈ నివేదిక చెబుతోంది.. ఏషియాన్   పవర్ ఇండెక్స్.. లెవ్ ఇన్స్టిట్యూట్  2020 లెక్కల ప్రకారం ఇండో పసిఫిక్ దేశాలు సహ భారత ఆర్థిక వ్యవస్థ కరోనా  వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. కాగా  ప్రపంచ ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు ఆర్ధికంగా తక్కువ శక్తివంతమైన దేశాలుగా  మారుతున్నాయని  ఈ సర్వే నివేదిక తెలిపింది.

 చైనా త్వరగా కరోనా  వైరస్ నుంచి కోలుకోవడం వల్ల చైనా ఆర్థిక శక్తితో పోల్చిచూస్తే ఇతర దేశాల ఆర్థిక శక్తి ఎంతో అంతరం పెరిగిపోతుంది అన్నది ఈ నివేదిక చెబుతోంది. గతంలో  ఏషియన్  పవర్ ఇండెక్స్ సర్వేలో భారత్ కి నాలుగో ర్యాంకు వచ్చింది.. కానీ ప్రస్తుతం గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రధాన శక్తివంతమైన దేశాల నుంచి మధ్యస్థ  శక్తివంతమైన శక్తిగా  భారత్ మారిపోయిందని  ఈ నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ కరోనా  ముందు అంచనాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 13 శాతం తక్కువ స్థాయిలో నమోదు చేస్తుంది అనేటువంటిది ఈ నివేదిక చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: