ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు..
కేసీఆర్ ఏమన్నారంటే..?
"ప్రస్తుతం డీఏ ఎంతనే విష యంలో కేంద్ర ప్రభుత్వం ముందు తన నిర్ణయం ప్రకటిస్తోంది. దాన్ని రాష్ట్రాలు అను సరిస్తున్నాయి. కేంద్రం అంచనాలు తయారు చేసి, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మూడు డీఏలు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రెండు డీఏల విషయంలో కేంద్రం ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. దీంతో రాష్ట్రాలు జాప్యం చేయాల్సి వస్తోంది, ఫలితంగా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. ప్రతీ 6నెలలకు ఒకసారి గడువు తేదీ రాగానే రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలి.కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే దాన్ని సవరించాలి."
దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ‘కరోనా లాక్డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడిందని, కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిందని.. చివరిగా దీని ప్రభావం రాష్ట్రాలపై పడుతోందని అన్నారు కేసీఆర్. ఈ పరిస్థితుల నేపథ్యంతో వాస్తవానికి ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాలని, ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలని చెప్పారు. మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వానిక నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.