హమ్మయ్య... ఇండియాలో చావులు బాగా తగ్గాయి...!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గటం, పెరగటం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా నెల రోజుల నుంచి కరోనా తీవ్రత ఊహించిన దాని కంటే కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి. అయితే ఇది తుఫాన్ ముందు ప్రశాంతత అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గడంతోపాటు రికవరీ కూడా కాస్త ఎక్కువగానే పెరుగుతుంది అనే చెప్పాలి. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో  కరోనా కేసులు కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. త్వరలోనే పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక  ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 78 లక్షల 14  వేలు దాటాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గడచిన 24 గంటలలో 53,370  “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 650 మంది  మృతి చెందరు. ఈ మధ్య కాలంలో ఇదే అతి తక్కువగా మరణాలు నమోదు కావడం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 67,549గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 78,14,682 గా ఉంది.
దేశ వ్యాప్తంగా “యాక్టీవ్” కేసులు 6,80,680 ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70,16,046 గా ఉంది.  “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి  సంఖ్య 1,17,956 గా ఉంది.  దేశంలో 89.78 శాతంగా “కరోనా” రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 8.71  శాతం మాత్రమే ఉన్నాయి.  దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి మరణాల రేటు తాగింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 12,69,479గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం “కరోనా” టెస్ట్ ల సంఖ్య 10,13,82,564 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: