త్వరలో ఏపీ లో హై అలర్ట్ తప్పదా... ఎందుకంటే.?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటివరకు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి  దీంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  వైరస్  కంట్రోల్  కాలేదు కదా ఏకంగా  రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీగా కేసులు నమోదైనప్పటికీ ఎక్కువగానే పరీక్షలు నిర్వహించారు.

 క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ విషయంలో కూడా ఎంతో సమర్థవంతంగానే జగన్ సర్కార్ ముందుకు సాగింది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికవరీ రేటు పెరగడంతో పాటు కరోనా  వైరస్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రజల్లో కూడా అవగాహన పెరిగిపోయి కరోనా  వైరస్ దరిచేరకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  వైరస్ కేసుల సంఖ్య భారీ రేంజ్లో తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ కరోనా  కేసుల సంఖ్య దారుణంగానే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.

 ఏపీ లోని ఐదు జిల్లాలో కరోనా  వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చిత్తూరు గుంటూరు ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడ కంట్రోల్ కావడం లేదు. దేశంలోనే కరోనా వైరస్ తీవ్రంగా 30 జిల్లాలలో ఈ ఐదు జిల్లాలు కూడా ఉన్నాయి . అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం విశ్లేషకులు ఏమంటున్నారంటే రానున్న రోజుల్లో సెకండ్ వేవ్  మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని.. ఐదు జిల్లాల ప్రజలు అయితే మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఐదు జిల్లాల్లో ప్రజలు ఎక్కువగా  అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: