ఆలస్యంగా వచ్చిన తొలకరి చినుకులు పలకరించి పారిపోయాయి. దాంతో విద్యుత్ విష్యంలో అటు ప్రభుత్వం ఇటు ప్రజల్లో గుబులు మొదలైంది. అసలే విద్యుత్ సరఫరా అంతంత మాత్రన కొనసాగుతోంది. కనీసం వర్షాలు కురిసి జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తిసామర్ధ్యంతో పని చేసే ఈ సమన్య కొంత వరకు పరిష్కారం కావచ్చునని ట్రాన్స్ కో అధికారులు ఆశపడ్డారు. కాని రుతు పవనాలు స్ధిరంగా లేవని తెలుసినప్పటి నుంచి వాన వాన రావమ్మ అంటూ ఎదురుచూపులు చూడటం మొదలుపెట్టారు. వ్యవసాయరంగానికి సంబంధించి ప్రస్తుతం 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు కచ్చితంగా రోజుకు ఏడు గంటల పాటు రెండు దశల్లో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. ఇది ప్రభుత్వం కమిట్ మెంట్ కూడా. దానికితోడు వేసవిలో చిన్న తరహా పారిశ్రామికరంగానికి విధించిన కోతను పునరుద్ధరించడం, గృహావనరాల సరఫరాను మెరుగుపర్చటం వంటి బాధ్యతలు కూడా ప్రభుత్వంపై ఉంది. ఈ పరిస్ధితుల్లో ఈ నెల 20వ తేదీ వరకు ప్రతిరోజు 256.69 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. అయిన డిమాండ్‌కు సరఫరాకు మధ్య ఎంతో వ్యత్యసం ఉంది. ఈ నెల 22వ తేదీ నాటికి 24.22 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. ఇది రాష్ట్రంలో విద్యుత్ పరిస్ధితి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా విద్యుత్ ఉత్పత్తి అంటే వర్షాలపై అధారపడటమే తప్పా ప్రత్యామ్నాయ మార్గాల గురించి సీరియస్ గా ఆలోచించటానికి ఇంకెన్నాళ్లు పడుతుందో వేచిచూడాల్సిందే మరి.
మరింత సమాచారం తెలుసుకోండి: