ప్రధాన వార్తా సంస్థ పిటిఐ పై కేంద్రం ఉక్కుపాదం...?

VAMSI
ఈరోజుల్లో దేశంలోని మీడియా మరియు సోషల్ మీడియా యొక్క విశ్వసనీయతపై సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వారి మాటలకు లోబడి కొన్ని జాతీయ వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా వర్గాలు వ్యవహరిస్తున్నారు. వీరిని పొగిడే కార్యక్రమాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుని దేశంలో ఉన్న అనేక ప్రధాన సమస్యలను అణగదొక్కుతున్న తీరును మనం అనేక సందర్భాల్లో చూసి ఉంటాము. ప్రజలకు అండగా ఉండి నిజాన్ని నిర్భయంగా తెలియచేసే వార్తా సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తే మన సమాజం ఏవిధముగా ముందుకెళ్తుందని ఆందోళన కలుగుతోంది.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ ఏడాది జూన్లో జరిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య. దీనిని పక్కకు పెట్టేసి ఎంతసేపు డ్రగ్స్ కోణాన్ని తెరపైకి తెచ్చి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. అయితే మన దేశంలో ముఖ్యంగా రెండు ప్రధాన వార్తా సంస్థలు ఉన్నాయి. అవి ఒకటి పిటిఐ మరియు రెండవది యుఎన్ఐ. అయితే ప్రస్తుతం వచ్చిన సోషల్ మీడియా ద్వారా ఎప్పటి వార్తలు అప్పుడు రావడం, మీడియాలో వచ్చే టెక్నలాజికల్ మార్పులచేత యుఎన్ఐ పూర్తిగా తెరమరుగైపోయింది. కాగా పిటిఐ మాత్రం కొంతవరకు వీటన్నింటినీ ఎదుర్కొంటూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది.
ఇప్పుడు ఈ పిటిఐ ని కూడా రూపుమాపడానికి స్వయంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రసార భారతి కంకణం కట్టుకోవడం జీర్ణించుకోలేని విషయం.  ఈ వివాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చైనాలో ఉన్న భారతదేశ రాయబారిని పిటిఐ విలేఖరి ఒకరు ఇంటర్వ్యూ చేసినప్పుడు...రాయభారి మాట్లాడుతూ ...చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం సరికాదన్నారు...అదేసమయంలో భారత ప్రధాని, చైనా మన భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ వార్త దూరదర్శన్ లో కూడా ప్రసారం అయింది. అయితే దీనికి ప్రధాని ఇలా అనడంపై అప్పట్లో ఎవరూ ఏమీ అనలేక.. మొత్తం తప్పంతా పిటిఐ పై వేసింది...అంతేకాకుండా దీనికి ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపివేయడం జరిగింది. అప్పటినుండి పిటిఐ ని కార్నర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియడం లేదు.  ఇలాంటి వార్తా సంస్థలు లేకుంటే రాను రాను..ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి డప్పు కొట్టే వార్తా సంస్థలు మాత్రమే ఉంటాయి...ప్రజలకు నిజాలు తెలియనివ్వకుండా...అబద్దపు రాతలను రాస్తూ అధికారపార్టీలకు కొమ్ముకాస్తూఉంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: