తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా తర్వాత శుభవార్త..?
ఇక ఇటీవల తెలంగాణ ఆర్టిసి సూచించిన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ముందుకు పంపినప్పటికీ తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నిరాశే ఎదురైంది ప్రయాణికులకు. అయితే కనీసం దసరా పండుగ నేపథ్యంలో ఎంతో మంది ప్రయాణికులు హైదరాబాద్ నగరం ఏపీ రోజు పలు ప్రాంతాలకు ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పండగ కి ముందు అయిన బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ప్రయాణికులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ అది కుదరలేదు అన్న విషయం తెలిసిందే.
అయితే తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్నదానిపై కనీస అంచనా కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏపీ తెలంగాణ ఆర్టిసి బస్సు సర్వీసులు దసరా తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల 27వ తేదీన ఏపీ తెలంగాణ ఆర్టీసీ అధికారులు భేటీ కానున్నట్లు సమాచారం. ఇక ఈ భేటీలో అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులకు సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందం దసరా కు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ దసరా నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ అధికారులకు మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో కుదరలేదు.