ఈ కార్డు వాడుతున్నారా.. అయితే మీకే ఈ బంపర్ ఆఫర్.. 65 శాతం డిస్కౌంట్.?
ఆయా బ్యాంకులు డెబిట్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొన్ని ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు.. తమ సేవలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ ఉంటాయి. అంతేకాదు డెబిట్ కార్డు సంస్థలు కూడా తమ వినియోగదారులందరికీ ఎన్నో వినూత్న మైన ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంటాయి.
ఇక తాజాగా రూపే కార్డు కాదు వాడుతున్న వినియోగదారులందరికీ అదిరిపోయే శుభవార్త అందింది. ఏకంగా భారీ డిస్కౌంట్ లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. రూపాయి కార్డు వినియోగదారులకు ఎన్పిసిఐ భారి డిస్కౌంట్లు ప్రకటించింది. వివిధ బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోలు పై 65 శాతం వరకు డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంది అంటూ తెలిపింది. రూపే ఫెస్టివ్ కార్నివాల్ పేరిట ఈ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది ఎన్పి సి ఐ. అమెజాన్, స్విగ్గి, సాంసంగ్ లాంటి ప్రముఖ సంస్థల ఉత్పత్తులపై దాదాపుగా పది శాతం నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి అంటూ తెలిపింది. హెల్త్ ఫిట్నెస్ ఈ కామర్స్ ఎడ్యుకేషన్ ఫుడ్ డెలివరీ ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించి డిస్కౌంట్లు వర్తిస్తాయి అని ఎన్ పి సి ఐ స్పష్టంచేసింది.