చైనాకి భారీ షాక్.. స్వాధీనం చేసుకున్న భారత్..?
ప్రస్తుతం పదునైన వ్యూహాలతో దూసుకుపోతూ చైనాకు సంబంధించిన వ్యూహాత్మక ప్రదేశాలను ఆక్రమించుకున్న భారత ఆర్మీ ని వెనక్కి పంపించడం ఎలా అని అర్థం కాక ప్రస్తుతం తలపట్టుకుంది చైనా. అయినా భారత ఆర్మీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పటికి చైనా ఎల్ఏసి వెంబడి లోపలికి చొరబడి ఏకంగా ఏడు చైనా కు సంబంధించిన ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది భారత్. ఈ విషయాన్ని భారత్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు భారత్ మరింత దూకుడుగా సరిహద్దుల్లో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పర్వతాల్లో చలికి చైనా సైనికులు తట్టుకోలేక చనిపోతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ప్రస్తుతం చైనా సైనికులు మరో ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 34 ఏళ్ల క్రితం చైనా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఇటీవలే భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఏకంగా 500 మంది సైనికుడు పర్వత ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం భారత సైనికులు ఆధీనంలోకి తెచ్చుకొన్న పర్వత ప్రాంతం లోయలో చైనా నిర్వహించే అన్ని కార్యకలాపాలను పూర్తిగా గుర్తించే విధంగా ఉంది అని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.