పాకిస్థాన్ ఆర్మీకి చెమటలు... అందుకే అభినందన్ ని విడుదల చేశారు: పాక్ ఎంపీ

RAVI TEJA
పాకిస్థాన్ ఆర్మీకి చెమటలు...
అందుకే అభినందన్ ని విడుదల చేశారు: పాక్ ఎంపీ
కరాచీ: భారత యుద్ధ విమాన పైలట్ అభినందన్ వర్థమాన్ ని విడిచిపెట్టకుంటే భారత్ దాడి చేస్తుందని పాకిస్థాన్ ఆర్మీ భయపడిందా? అందుకే ఆగమేఘాల మీద అభినందన్ ని భారత్ కు అప్పగించారా? భారత్ యుద్ధం చేస్తుందని దాయాది దేశానికి భయం పట్టుకుందా? అంటే అవుననే తెలుస్తోంది. బుధవారం జరిగిన పాకిస్థాన్ పార్లమెంట్ సమావేశాల్లో ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్తల్ని ఆ దేశ మీడియాలో ప్రసారమయ్యాయి. ఆ కథనం ప్రకారం ...పాకిస్థాన్ ముస్లిం లీగ్ అగ్ర నాయకుడు ఆయాజ్ సిద్దిఖ్ బుధవారం పార్లమెంట్లో మాట్లాడుతూ అభినందన్ విడుదల అంశాన్ని ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ..." భారత్ మనపై దాడి చేస్తుందనే భయంతోనే ఇమ్రాన్ ఖాన్ సర్కారు అభినందన్ ని విడుదల చేసింది" అని అన్నారు. పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఒక ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ అభినందన్ ని విడుదల చేయకుంటే ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత్ దాడి చేసేదని ఆయన అన్న విషయాన్ని బహిర్గతం చేశారు. విపక్షాలతో జరిగిన పార్లమెంటరీ సమావేశంలోనూ భారత పైలట్ ని వదిలేయాలని ఆర్మీ చీఫ్ ని ఆదేశించినట్లు తనకు గుర్తుందన్నారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఆ సమావేశానికి హాజరవ్వలేదని, పాక్ ఆర్మీ చీఫ్ కాళ్ళు వణికిపోయాయని, జనరల్ కు చెమట్లు పట్టాయని ఆయన తెలిపారు.
అభినందన్ విడుదలతో సహా ప్రభుత్వాన్ని మేము ప్రతి విషయంలోనూ సమర్ధించామని ఇకపై అది కొనసాగదని ఆయన స్పష్టం చేశారు.
గత  ఏడాది ఫిబ్రవరిలో భారత్ వాయుమార్గంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్-16 ను అభినందన్ వెంబడించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అభినందన్ నడుపుతోన్న యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది. దీంతో అతణ్ని పాక్ సైన్యం బంధించి మార్చి 1 న విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: