జగన్ ని జైల్లో పెడితే... ఉండవల్లి సంచలనం...!

Gullapally Rajesh
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ రాజశేఖరరెడ్డి కొడుకు గా పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తారనుకున్నాం అని ఆయన అన్నారు. పార్లమెంటు లో చేసిన చట్టం గొప్పదా ? మోదీ, చంద్రబాబు లు చేసుకున్న ఒప్పందం గొప్పదా ? సమాదానం చెప్పాలి అని డిమాండ్ చేసారు. విభజన సమయంలో పార్లమెంట్ లో ఏమి జరిగిందో మాట్లాడే ధైర్యం టీడీపీ , వైఎస్సార్ కాంగ్రెస్ లకు లేదు అని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పక్కన పెట్టారు అని అన్నారు.
పోలవరం కూడా పక్కన పెడితే ఏలా ? పోలవరం ప్రాజెక్టు విషయం లో పార్లమెంట్ లో చేసిన చట్టం అమలు చేయాల్సిందే అని అన్నారు. కేంద్రం చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు పనుల్లో  2014 రేట్లు 2018 లో ఉంటాయా ? అని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన జగన్ పోలవరం పై మోదీ ని ఎందుకు నిలదీయడం లేదు ? అని ఆయన ప్రశ్నించారు.  కేసులు ఉండటం వల్లే మోదీ ని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారం జనంలో ఉంది అని ఆయన అన్నారు.
 జగన్ ను మోదీ జైలులో పెడితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని అన్నారు. జగన్ ను జైలులో వేయటం అంత సులువా ? అని ఆయన నిలదీశారు. కేసులు నుంచి బయటపడేందుకు జగన్ మౌనం గా ఉంటే ప్రజలు క్షమించరన్నారు.  51 శాతం ఓట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలు జగన్ ధైర్యంగా మాట్లాడతారని భావించారని ఆయన పేర్కొన్నారు. జగన్ కు ధైర్యం ఏమైందని ప్రశ్నించారు. కేవీపీ కోర్టు లో వేసిన పిటిషన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు. మీరు మోదీ కి లొంగిపోయారనుకోవాలా ? ఎందుకు లొంగిపోవాలి అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: