వ్యవసాయం పై జగన్ అద్భుత నిర్ణయాలు..రైతులకు పండగే..?

P.Nishanth Kumar
ఏపీ లో జగన్ సాగిస్తున్న పరిపాలనకు పక్క రాష్ట్రాలనుంచి సైతం అభినందనలు వస్తున్నాయి.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అక్షరాల నిలబెట్టుకుంటున్న జగన్ ని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి గా చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.. రోజు రోజు కి ప్రజలకు దగ్గరగా అవుతున్న జగన్ ను చూసి చాలామంది నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమంత్రి కావాలో అలాంటి ముఖ్యమంత్రి ని ఎన్నుకున్నారు ప్రజలు.. మరోవైపు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు.. అందుకే తాను ముఖ్యమంత్రి పదవి లో ఉన్నానన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు..
మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి విషయంలో జగన్ ను చంద్రబాబు పెట్టిన ఇబ్బంది అందరికి తెలిసిందే.. మరోవైపు తన మనుషుల తో ప్రభుత్వం పై కేసులు వేసి పైశాచిక ఆనందం పొందారు.. తన అనుకూల మీడియాలో జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ పై మెచ్చే వేసే ప్రయత్నం చేశారు.. ఎన్ని చేసిన ప్రజల అండతో జగన్ సుపరిపాలన అందిస్తూ వారి దృష్టిలో దేవుడిగా నిలిచిపోతున్నాడు..
 
ఇక తాజాగా రైతులకు మరొక వరాన్ని కురిపిస్తున్నారు జగన్.. ఇప్పటికే . వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన జగన్‌ సర్కార్‌.. ఈ దిశగా రైతు భరోసా కేంద్రాలను బహుళ సదుపాయాలు గల కేంద్రాలుగా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పక్కా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోదాములు, కోల్ట్‌ స్టోరేజీలు, ధాన్యం కళ్లాలు, యంత్ర పరికరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, పాలశీతలీకరణ యూనిట్లు, ఆక్వా బజార్లు, ఆహారశుద్ధి ప్లాంట్లు, ఈ–మార్కెటింగ్‌ వేదికలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ సంకల్పించారు. ఇందు కోసం 6,093 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ పనులన్నీ ఏక కాలంలో అన్ని రైతు భరోసా కేంద్రాలలో ప్రారంభం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్థేశం చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: