అతను ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోను అంటున్న ఎంపీ..?
అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ముమ్మర ప్రచారం చేపడుతూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తామని తాము అధికారంలోకి వస్తే ఏం చేపడతామో అనే దానిపై కూడా ఎన్నో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓటర్ మహాశయులకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక ఈ సారి ఎన్డీయే కూటమి తప్పక భారీ మెజారిటీ సాధించి మళ్లీ అధికారాన్ని చేపట్టపోతుంది అని ప్రస్తుతం ధీమాతో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎన్డీయే కూటమిని చీల్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి విజయం సాధించాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికలపై ఇటీవలే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి సీటు లోకి వచ్చిన తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులు ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ.. సిబిఐ అధికారులు వెంటాడుతున్నప్పటికీ ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతాను అంటూ ప్రత్యర్ధులకు తేజస్వి యాదవ్ సవాల్ విసురుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ రౌత్. ఎవరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోరాడటం ఎంతో అభినందనీయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.