భాగ్య నగరం వరద సహాయ నిధుల లో భారీ కుంభకోణం జరిగిందా..?
అయితే మితిమీరిన వారి ఇన్వాల్వ్ మెంట్ అవినీతికి కారణం అయింది అని ఆరోపణలు వస్తున్నారు.. అంతేకాదు అనేక బస్తీలలో ఎలాంటి ఆర్థి సాయం అందకపోగా… అరకొరగా అందిన చోట… టీఆర్ఎస్ సానుభూతిపరులన్న కుటుంబాలకే సాయం చేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి..దీంతో ఓ బస్తీలో వంద కుటుంబాలు ఉంటే.. పది కుటుంబాలే సాయం పొందాయి ని ప్రజలు ఆరోపిస్తున్నారు.. ఇప్పటికే తెలంగాణ లో పార్టీ కి కొంత వ్యతిరేకత మొదలైంది.. అందునా గ్రేటర్ ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు పార్టీ కి మంచి కావు.. ఒక బస్తి లో పది కుటుంబాలకు సాయం వస్తే మిగతా 90 కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యాయి. ఆ పది కుటుంబాలైనా ప్రభుత్వంపై సానుభూతితో ఉన్నాయా అంటే అదీ లేదు. వారికి రూ. పదివేల సాయం పేరుతో… ఇచ్చింది రూ. ఐదు వేలు మాత్రమేనట దాంతో వారి సానుభూతి కూడా పార్టీ కి దూమైపోయింది.
స్థానిక నేతలందరూ తమ తమ వాటాలు పంచుకోవడంతో ఆ సాయం చిక్కిపోయింది. చివరికి ఆ సాయం వ్యవహారం మొత్తం ప్రహసనంగా మారిపోయింది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తూండటంతో ప్రభుత్వంలోనూ కలవరం ప్రారంభమయింది. వెంటనే… సాయం అందచేసే ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించారు. ఏదేమైనా ఇలాంటి అవినీతులు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి.. ఎన్నికల సమయంలో ఇలా చేస్తే అసలుకే ఎసరు రావచ్చు.. దీని టీఆరెస్ పార్టీ ఎలా దీన్ని అధిగమిస్తుందో చూడాలి..