తల్లి పెట్టిన వాట్సాప్ స్టేటస్.. కొడుకును జైలుపాలు చేసింది.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకీ పెరిగిపోవడమే  కాదు ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడటం కూడా రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడి ఫోన్ లో వాట్సాప్ కూడా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. రోజురోజుకు వాట్సాప్ ద్వారా సంభాషణలు జరపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు నేటితరం జనాలు. డైరెక్టుగా మాట్లాడడం కంటే వాట్సాప్ లో మాట్లాడడానికి డైరెక్ట్ గా చూడటం కంటే వీడియో కాల్ లో కలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.


 అయితే వాట్సాప్ కారణంగా కొన్ని అనర్థాలు కూడా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రతి విషయాన్ని స్టేటస్ లో పెట్టడం ఈమధ్య కాలంలో కామన్గా మారిపోయింది. ఇటీవలే ఇక్కడ ఓ తల్లి  పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఏకంగా కొడుకును జైలుపాలు చేయించింది. ఆసక్తికర ఘటన  హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహిళ పెట్టిన స్టేటస్ కారణంగా ఏకంగా  పోలీసులు ఆ మహిళ కొడుకును అరెస్టు చేశారు.


 15 నెలల క్రితం రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో జ్యువెలరీ దొంగతనం జరిగింది.. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాదాపు 15 నెలల క్రితం రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే సాయి  కిరణ్ అనే వ్యక్తి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇటీవలే ఓ చిన్ని ఆధారం కారణంగా కేసును ఛేదించారు పోలీసులు. అయితే 15 నెలల క్రితం దొంగతనం కేసులో మహిళ పెట్టిన స్టేటస్ దొంగను  పట్టించింది. ఇటీవలే హాసాయి య్ కిరణ్ ఇంటి పక్కనే ఉండే మహిళ దొంగిలించబడిన నగలు పెట్టుకుని ఉన్న ఫోటోను స్టేటస్ లో పెట్టింది చూసి పోలీసులకు సమాచారం అందించారు సాయి కిరణ్ . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి కటకటాల వెనుకకు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: