మాస్క్ కోసం కొత్త చట్టం.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కుల వాడటం తప్పనిసరి గా మారిపోయిన విషయం తెలిసిందే. మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తప్పనిసరిగా ప్రజలందరూ మాస్కులు  ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్న  విషయం తెలిసిందే. మాస్కులు ధరించడం ద్వారా నే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుంది అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.



 ఇలా మాస్కులు ధరించి ప్రాణాలను కాపాడుకోవాలి అని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ మాస్కులు ధరించని  వారిపై జరిమానాలు విధిస్తున్నప్పటికి ఎక్కడ మార్పు మాత్రం రావడం లేదు. దీంతో రోజురోజుకు మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా కరోనా  వైరస్ వాహకాలుగా మారిపోతున్నారు ఎంతోమంది. వెరసి రోజురోజుకు అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తప్పనిసరిగా  అందరూ మాస్కులు ధరించే  విధంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.



 ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వం కీలక చట్టం  ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుత సమయంలో మాస్కులు తప్పనిసరిగా మారిపోయిన నేపథ్యంలో మాస్క్ తప్పనిసరి చేస్తూ సరికొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది రాజస్థాన్ ప్రభుత్వం. ఎన్నిసార్లు ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ ప్రజలలో మార్పు రాని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో  ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు రాష్ట్ర అంటువ్యాధుల చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో సరి కొత్త బిల్లును ప్రవేశపెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం.అయితే భారతదేశంలో మాస్క్  కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకు వచ్చేందుకు నిర్ణయించిన మొదటి ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: