దాపరికం లేనేలేదు.. ఉన్నదున్నట్టుగా.. జగన్ కొత్త సంప్రదాయం..?
కానీ.. ఇందుకు తాను భిన్నం అని మరోసారి ఏపీ సీఎం జగన్ తెర తీశారు. ఉన్నదున్నట్టుగా మాట్లాడే ప్రయత్నం జగన్ చేశారు. ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ సీఎం జగన్ ఏపీ వాస్తవ దృశ్యాన్ని ఆవిష్కరించారు.. నేటికి కూడా 33 శాతం మన రాష్ట్రంలో చదువురాని వారు ఉన్నారని.... నేటికి కూడా దాదాపుగా 85 శాతం ప్రజలు తెల్లరేషన్ కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారని.. స్వయం సహాయక బృందాల్లో చేరి స్వావలంబన కోసం సుమారు 90 లక్షల మంది అక్కచెల్లెమ్మలు సమరం చేస్తున్నారని అవతరణ దినోత్సవం వేళ ఆవిష్కరించారు.
అలాగే.. ఒక పంటకు కూడా కనీసం నీటి సదుపాయం లేకుండా కోటి ఎకరాలు భూములు ఇవాల్టికి మన రాష్ట్రంలో ఉన్నాయన్నాని చెప్పారు.. నేటికి కూడా ఆవాసం కోసం ఎదురుచూస్తున్న 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయన్నాని తెలిపారు.. పిల్లల చదువుల కోసం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఆస్తులు ఎన్నో కుటుంబాలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఉందంటూ రాష్ట్రంలోని వాస్తవ దృశ్యాన్ని కళ్లకు కట్టారు.
ఉన్న సమస్యలన్నీ చెబుతూ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం జగన్. సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. అయినా కర్తవ్యం పవిత్రమైంది.. లక్ష్యం ఉన్నతమైనదని కాబట్టి ప్రజాబలంతో మార్గం వేయగలం అని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలం అన్న నమ్మకంతో ఇక మీద మన రాష్ట్రంలో ఇంటింటి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మన ప్రభుత్వం వెరపన్నది లేకుండా ముందుకు సాగుతుందని రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలందరకీ మనవి చేస్తున్నానన్నారు.